గతేడాది ‘వినయ విధేయ రామా’ చిత్రంతో బోయపాటి శ్రీను… ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాలతో బాలకృష్ణ డిజాస్టర్లు మూటకట్టుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రంతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే… ‘ఎన్.బి.కె 106’ ను బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం మొదలుకావాల్సి ఉంది. కానీ ఇటీవల బోయపాటి తల్లి మరణించడంతో అది కుదర్లేదు. ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలినట్టు కూడా తెలుస్తుంది.
అదేంటంటే.. మొదట ఈ ప్రాజెక్ట్ కు ప్రసాద్ మూరెళ్ళ ను కెమెరా మెన్ గా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నారట. ప్రస్తుతం మిగిలిన కెమెరామెన్ లు అందరూ పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సరైన కెమెరామెన్ దొరకడం కాస్త కష్టమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రం బడ్జెట్ ను కూడా పరిమితుల్లో ఉండేలా చూడమని కుదిరితే తగ్గించమని.. ‘ద్వారకా క్రియేషన్స్’ (ఈ చిత్రం నిర్మాతలు) బోయపాటి ని కోరినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో తెలియాలి అంటే చిత్ర యూనిట్ సభ్యులు స్పందించాల్సిందే.
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!