Unstoppable: అన్ స్టాపబుల్ కు మరో తలనొప్పి.. స్టార్ హీరో అలా రియాక్ట్ అయ్యారా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్3 త్వరలో మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు భగవంత్ కేసరి టీం హాజరు కానుందని సమాచారం అందుతోంది. ఈ షో కోసం మంత్రి కేటీఆర్ ను సంప్రదించగా ఆయన సున్నితంగా నో చెప్పారని తెలుస్తోంది. చిరంజీవి గారిని సంప్రదించగా ఆయన చూద్దాం అని చెప్పినట్టు సమాచారం అందుతుండటం గమనార్హం. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు మాత్రం ఈ షోకు సంబంధించి ఆహ్వానం అందే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ షో సీజన్3 (Unstoppable3) ను సైతం హిట్ చేయాల్సిన బాధ్యత బాలయ్యపై ఉండగా బాలయ్య తన టాలెంట్ తో హిట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. ఈ షోకు రజనీకాంత్ హాజరవుతారని వినిపిస్తున్నా ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సమాచారం అందుతుండటం గమనార్హం. అన్ స్టాపబుల్ సీజన్3 కోసం బాలయ్య పరిమితంగానే పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షోకు సంబంధించి ఇదే లాస్ట్ సీజన్ అని సమాచారం అందుతోంది.

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడం వల్ల కేటీఆర్ ఈ షోపై ఆసక్తి కనబరచలేదని సమాచారం. ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ లేవీ లేకపోవడం కూడా ఈ షోకు ఒకింత మైనస్ అయిందని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సింగిల్ రోల్ లో కనిపిస్తుండగా ఈ పాత్ర సీరియస్ పాత్ర కావడంతో ఈ సినిమాతో బాలయ్యకు ఎలాంటి సక్సెస్ దక్కుతుందనే చర్చ జరుగుతోంది.

భగవంత్ కేసరి సినిమాకు 120 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాలో యాక్షన్ సీన్లతో పాటు కామెడీ సీన్లకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus