Prabhas: ‘కె.జి.ఎఫ్2’ రిజల్ట్ తో ఫోకస్ అంతా ప్రభాస్ వైపు మళ్ళింది..!

  • April 15, 2022 / 04:56 PM IST

‘సాహో’ రిజల్ట్ ఏమో కానీ ‘రాధే శ్యామ్’ రిజల్ట్ మాత్రం ప్రభాస్ అభిమానులు బాగా హర్ట్ అయ్యేలా చేసింది. ‘రాధే శ్యామ్’ మరీ తీసిపారేసే మూవీ కాదు. కానీ మొదటి షో నుండే డివైడ్ టాక్ పడిపోయింది.. దానికి కారణం ఆ సినిమాలో ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం. ‘బాహుబలి’ తో ప్రభాస్ ఇండియా వైడ్ స్టార్ డంని సొంతం చేసుకున్నాడు. అలాంటప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు కలిగిన మూవీ చేయాలి.

Click Here To Watch NOW

కానీ ప్రభాస్ ‘ఆదిపురుష్’ వంటి మైథలాజికల్ మూవీస్ చేస్తున్నాడు. అవి ఈ టైములో అతను చేయాల్సిన సినిమాలు కావు అనేది కొందరి అభిప్రాయం. అర్జెంట్ గా ప్రభాస్ కటౌట్ కు తగ్గ ఓ మాస్ సినిమా పడాలి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ తీసుకున్న బెస్ట్ డెసిషన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ప్రాజెక్టు ఓకె చేయడం. ఇది నిన్న ‘కె.జి.ఎఫ్2’ చూసిన ప్రతీ ఒక్కరూ చెబుతున్న మాట. ఈ మూవీలో హీరో యష్ ను ఓ రేంజ్లో ప్రెజెంట్ చేసాడు ప్రశాంత్ నీల్.

ఇలాంటి సీన్లు కదా ప్రభాస్ కు పడాల్సింది అంటూ.. థియేటర్లో ఉన్న ప్రభాస్ అభిమానులంతా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్2’ రిజల్ట్ తో ప్రభాస్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. కచ్చితంగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కు మంచి మాస్ హిట్ అందించి తనకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని. ప్రభాస్ కు ‘కె.జి.ఎఫ్’ లాంటి హిట్ పడితే కచ్చితంగా ఇప్పుడు ‘కె.జి.ఎఫ్2’ కలెక్ట్ చేసినదానికి డబుల్ కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు సైతం చెబుతున్నారు.

ఇక శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘సలార్’ లో జగపతి బాబు ఓ విలన్ గా నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన లుక్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి పెద్ద లెవెల్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. మే నెలలో ‘సలార్’ నుండీ ఓ గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ కాబోతుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus