Ori Devuda Collection: 5వ రోజు ‘ఓరి దేవుడా’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

Advertisement

విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా రూపొందిన తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవలె’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ‘పి వి పి’ బ్యానర్ పై ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్వ‌త్ మారి ముత్తు దర్శకుడు. స్టార్ హీరో వెంకటేష్ ఈ మూవీలో దేవుడు పాత్రలో కనిపించడం విశేషంగా చెప్పుకోవాలి.

ఈ చిత్రం దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల అయ్యింది. మొదటి రోజు పాజిటివ్ టాక్ ను రాబట్టుకున్న ఈ మూవీ స్టడీగా రాణిస్తుంది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.50 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.57 cr
ఈస్ట్ 0.21 cr
వెస్ట్ 0.17 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.29 cr
నెల్లూరు 0.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.63 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.14 cr (షేర్)

‘ఓరి దేవుడా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.5.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టాక్ పాజిటివ్ గా వచ్చినా, ఈ చిత్రంలో వెంకటేష్ వంటి స్టార్ హీరో నటించినా మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ 5 రోజుల్లో కేవలం రూ.4.14 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.1.46 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా స్టడీగా రాణించి రెండో వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus