Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Advertisement

Cast & Crew

  • టోవినో థామస్ (Hero)
  • కయాదు లోహర్ (Heroine)
  • విజయ రాఘవన్, బాబు రాజ్, ప్రశాంత్ అలెగ్జాండర్, శత్రు తదితరులు (Cast)
  • డిజో జోస్ ఆంటోనీ (Director)
  • నౌఫల్, బ్రిజిష్, చాణక్య, చైతన్య, చరణ్ (Producer)
  • జేక్స్ బిజోయ్ (Music)
  • టిజో టోమి (Cinematography)
  • శ్రీజిత్ నారంగ్ (Editor)
  • Release Date : 17th ఏప్రిల్ 2026
  • వరల్డ్ వైడ్ ఫిల్మ్స్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ (Banner)

ఓటీటీల్లో మలయాళం సినిమాలను చూసి తెలుగు సినిమాలను తక్కువ చేసే వారి సంఖ్య సోషల్ మీడియాలో ఎక్కువగానే కనిపిస్తుంది. కోవిడ్ టైమ్ నుండీ మలయాళం సినిమాని మన వాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే అక్కడి హీరోలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ , మార్కెట్ ఏర్పడ్డాయి. అలాంటి వారిలో టొవినో థామస్‌ ఒకడు. తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘2018’ ‘మిన్నల్ మురళీ’ ‘కొత్త లోక’ వంటి సినిమాలతో టోవినో థామస్‌కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతని లేటెస్ట్ మూవీ ‘పళ్లిచట్టంబి’ (Pallichattambi) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి:

Pallichattambi Movie Review

కథ: పళ్లి చట్టంబి కథకు మూలం కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతం. 1930లో నంబియార్ అనే దొర.. ఆంగ్లేయుల్ని సైతం భయపెట్టేస్తుంటాడు. తనకు ఎదురు తిరిగిన వారిని చంపేస్తూ, అటవీ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఇక 1958లో కేరళలో కమ్యూనిస్టుల ప్రభుత్వం ఏర్పడుతుంది. కణియార్ గ్రామంలో కమ్యూనిస్టుల బెడద నుంచి తమను తాము రక్షించుకునేందుకు అక్కడి క్రిస్టియన్లు, ఫాదర్ ఓ రక్షకుడిని (క్రిష్టోఫర్)ను తెచ్చుకుంటారు. అతడే కృష్ణ పిళ్లై అలియాస్ పోతన్ క్రిష్టోఫర్ (టొవినో థామస్).

కణియార్ గ్రామంలోకి క్రిష్టోఫర్ వచ్చిన తరువాత జరిగిన పరిణామాలేంటి? ఈ క్రమంలో కమ్యూనిస్ట్ కార్యకర్త రెబెకా (కయాదు లోహర్)తో ఏర్పడిన పరిచయం ఎలా మలుపు తిరుగుతుంది? ఆ ప్రాంతంలో అల్లర్ల వెనుకున్నది ఎవరు? అక్కడి రహస్య ప్రదేశం, పిశాచి తిరిగే కొండ అని ప్రచారం కాబడిన తరాయట్టుమల వెనుకున్న కథ ఏంటి? చివరకు క్రిష్టోఫర్ ఆ ఊరిని, అక్కడి ప్రజల్ని ఎలా కాపాడాడు? ఇందులో రైలు రామన్న (శత్రు) పాత్ర ఏంటి? నంబియార్ కారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనేది తక్కిన కథనం.

నటీనటులు పనితీరు: టొవినో థామస్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టొవినో థామస్ ఈ సారి మరో డిఫరెంట్ పాత్ర,యాస, లుక్స్‌తో మెప్పించేశాడు. కృష్ణ పిళ్లై అలియాస్ పోతన్ క్రిష్టోఫర్‌గా టొవినో థామస్ బాగా చేశాడు. రెబెక్కా పాత్రలో కయాదు లోహర్ హోమ్లీగా, అందంగా కనిపించింది. నటన పరంగానూ కయాదుకి మంచి కారెక్టర్ దక్కింది. పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించేది కొద్ది సేపే అయినా కూడా భయపెట్టాడు అని చెప్పాలి. తెలుగు నటుడు శత్రుకి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర దొరికింది. మిగిలిన వారంతా మలయాళీ నటులే కావడంతో తెలుగు వారికి అంతగా కనెక్ట్ అవ్వలేరనిపిస్తుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు: మలయాళీ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకుల్లో కొంతందికి ఓ ప్రత్యేకమైన అభిమానం. మన తెలుగు సినిమాల కంటే అక్కడి చిత్రాల్నే ఎక్కువగా పొగిడే వారు కూడా ఉన్నారు. కానీ ప్రతీసారి కేరళ చిత్రాల్ని ఆహా ఓహో అని మెచ్చుకోలేం. ఏ భాషలో తీసినా, ఎవరు తీసినా కూడా ఎమోషనల్‌గా కదిలించిన చిత్రాలు, రిలేటబుల్ అనిపించిన సినిమాలే విజయాలు సాధించాయి. భాషతో సంబంధం లేకుండా ఎమోషన్‌తో కనెక్ట్ అయితే ఆ చిత్రానికి హద్దులు అనేవి ఉండవు. కానీ ఈ ‘పళ్లిచట్టంబి’ ఎమోషన్ మిస్ అయ్యింది.

అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందో ప్రేక్షకుడికి అంతు పట్టదు. ఇదేంట్రా బాబు.. ఈ ఊరు ఏంటి? దాని సమస్య ఏంటి? అన్నది క్లారిటీగా చెప్పడంలో దర్శకుడు తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళంగానే అనిపిస్తుంది. ఊరి ప్రజలు, క్రిష్టియన్స్, కమ్యూనిస్టుల మధ్య గొడవలు, కమ్యూనిస్టుల్ని అడ్డుకునేందుకు క్రిష్టోఫర్‌ను నియమించడం ఇలా సినిమా సాగిపోతుంటుంది. కానీ ఆ జర్నీలో ఆడియెన్స్ భాగం అవ్వడానికి ఒక్క పాయింట్, సీన్ గానీ కనిపించదు. ఇంటర్వెల్ తరువాత కూడా కథ అలానే సాగుతుంది.

అయితే ఈ అల్లర్లన్నీ ఎందుకు జరుగుతున్నాయి.. వీటి వెనుకున్నది ఎవరు? అని ప్రీ క్లైమాక్స్‌తో తెలియడంతో కాస్త ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా ఓకె అనిపిస్తుంది. సెకండ్ పార్ట్ పై లీడ్ ఇచ్చినా అది ఫోర్స్డ్ గా అనిపిస్తుంది.సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే.. అందులో జేక్స్ బిజోయ్ మ్యూజిక్, టిజో టోమి సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. నేచురల్ లొకేషన్స్ లో తీసినా విజువల్స్ గ్రాండ్ గా అనిపించాయి.

విశ్లేషణ: భూమి కోసం పోరాటం అనే కాన్సెప్ట్‌తో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఇలాంటి పాయింట్‌ తీసుకున్నప్పుడు ఎమోషనల్‌ కనెక్టివిటి ముఖ్యం. అది మిస్ అవ్వడం వల్ల ‘పళ్లిచట్టంబి’ ఓ వృథా ప్రయత్నంగా మిగిలిపోయింది.

ఫోకస్ పాయింట్: ‘పళ్లిచట్టంబి’ టెక్నికల్ గా ఓకె.. కథనం వీకే

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus