Prabhas, Anushka: ప్రభాస్ నిక్ నేమ్ రివిల్ చేసిన అనుష్క.. సంతోషంలో ఫ్యాన్స్!

  • May 2, 2023 / 02:09 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్లలో పాల్గొని ప్రభాస్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటారనే చెప్పాలి ఏదైనా సినిమా గురించి ప్రమోట్ చేయాల్సి వస్తే తప్ప సోషల్ మీడియాలో స్పందించరు. ఈ క్రమంలోనే అనుష్క నటిస్తున్నటువంటి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా టీజర్ ను ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు.

ఇలా ప్రభాస్ ఈ సినిమా టీజర్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో అనుష్క ప్రభాస్ షేర్ చేసిన స్టోరీని షేర్ చేస్తూ తనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విధంగా అనుష్క ప్రభాస్ కు థాంక్యూ చెబుతున్న సమయంలోనే ఎవరికి తెలియనటువంటి ప్రభాస్ సీక్రెట్ బయటపెట్టారు. ఇక ఈమె ప్రభాస్ స్టోరీకి థాంక్యూ పప్సు అంటూ రిప్లై ఇచ్చారు. అయితే అనుష్క పప్సు అని సంబోధించినది ప్రభాస్ ని అని తెలియడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది (Prabhas) ప్రభాస్ ముద్దు పేరు అయి ఉంటుంది అందుకే అనుష్క తన నిక్ నేమ్ తో పిలిచారని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ ను చాలా మంది ప్రభ లేదా డార్లింగ్ అని పిలుస్తూ ఉండడం మనం చూసాము. ఇలా ప్రభాస్ నిక్ నేమ్ గురించి ఎవరికీ తెలియదు ఇలా ఎవరికీ తెలియని ప్రభాస్ సీక్రెట్ అనుష్క ఈ సందర్భంగా రివీల్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ జోడికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే.

వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఇక వీరిద్దరూ చివరిగా బాహుబలి సినిమాలో నటించారు. అయితే వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మంచిగా వర్క్ అవుట్ అవ్వడంతో ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఎంతోమంది ఫాన్స్ కోరుకున్నారు అయితే తమ మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందంటూ ఈ జంట ఈ వార్తలను ఖండించారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus