Pareshan Twitter Review: ‘పరేషాన్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

  • June 2, 2023 / 12:07 PM IST

‘మసూద’ చిత్రంతో హీరోగా నిలదొక్కుకున్నాడు తిరువీర్. అంతకు ముందు ‘ఘాజీ’ ‘పలాస’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలతో మెప్పించినప్పటికీ.. అతని కెరీర్లో ‘మాసూద’ ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇక తిరువీర్ హీరోగా రూపొందిన మరో చిత్రం ‘పరేషాన్’ జూన్ 2న విడుదల కాబోతోంది. సంపూర్ణేష్ బాబుతో ‘కొబ్బరి మట్ట’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన రూపక్ రొనాల్డ్సన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వాల్తేరు ప్రొడక్షన్స్’ బ్యానర్‌ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.

టీజర్, ట్రైలర్లకి మంచి రెస్పాన్స్ రావడం… హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రానికి (Pareshan) సమర్పకుడిగా వ్యవహరించడం వంటి కారణాలతో ఈ మూవీ పై జనాల ఫోకస్ పడింది. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా.. సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉందని అంటున్నారు. అక్కడక్కడా కొన్ని నవ్వించే మూమెంట్స్ తప్ప.. కథలో లాజిక్ లేదని, క్లైమాక్స్ లో సరైన కన్ క్లూజన్ ఇవ్వలేదు అని అంటున్నారు.

అయితే తిరువీర్ నటన బాగుందట. సోషల్ మీడియాలో క్రైస్తవుల గురించి ట్రోల్ అయ్యే అంశాలతో ఈ సినిమాలో కామెడీ సీన్లు ఎక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు. మొత్తంగా ఇది బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ అని అంటున్నారు. మార్నింగ్ షోలు ముగిశాక టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus