Parineeti Chopra: పరిణితి చోప్రా వెడ్డింగ్ రిటర్న్ గిఫ్ట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • October 3, 2023 / 07:21 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పరిణితి చోప్రా ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె గత నెల 24వ తేదీ ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. వీరి వివాహం ఉదయపూర్ లోని లీల ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు అలాగే ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇలా ఎంతో అంగరంగ వైభవంగా భారీ ఖర్చుతో పరిణితి చోప్రా రాఘవ్ వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఇక వీరి వివాహపు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరి వివాహానికి ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా హాజరయ్యారు. ఇక ఈమె పెళ్లికి వెళ్లడమే కాకుండా ఈ పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్స్ ఏమిచ్చారు అనే విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు.

దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది అయితే పరిణితి చోప్రా తన పెళ్లికి వచ్చిన వారికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు అనే విషయానికి వస్తే… సానియా షేర్ చేసిన ఫోటోలలో భాగంగా ఒక గిఫ్ట్ బాక్స్ లో ఒక వైట్ కర్చీఫ్ ఉండటంతో అందరూ షాక్ అయ్యారు.

ఇలా పరిణితి చోప్రా (Parineeti Chopra) తన పెళ్లికి వచ్చిన వారందరికీ ఒక వైట్ కర్చీఫ్ ఇచ్చారని తెలిసి అందరూ షాక్ అయ్యారు అయితే ఈ కర్చీఫ్ పై నా పెళ్ళికి వచ్చినా మీ అందరికీ నా పెళ్లి చూసి కనుక ఏడుపు వస్తే కన్నీళ్లు తుడుచుకోండి అని రాసి ఉంది. ఇలా ఈ రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధించినటువంటి ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయక కొందరు ఈ గిఫ్ట్ పట్ల సెటైర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus