Vinaro Bhagyamu Vishnu Katha: ‘వినరో భాగ్యము విష్ణు కథ’కి ఆఖరి రివ్యూ వచ్చేసింది!

సెల్‌ఫోన్‌ నంబర్‌ నైబర్‌ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ‘కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా పరదేశి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం బాక్సాఫీసు దగ్గర మిశ్రమ ఫలితం అందుకుంది అని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాపై ఆఖరి రివ్యూ వచ్చేసింది. అదేనండీ సీనియర్‌ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా గురించి తన అభిప్రాయం చెప్పారు. సినిమా తనకెంతో నచ్చిందని చెప్పిన ఆయన, హీరో నటనను, కథను మెచ్చుకున్నారు. అయితే ఈ కొన్ని మార్పులు చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అని చెప్పారు.

‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అంటూ సినిమాకు గమ్మత్తయిన టైటిల్‌ పెట్టారు. ఇక ఈ సినిమ మనసును హత్తుకునే చిత్రం. సెల్‌ ఫోన్లు ఉపయోగించే చాలామంది పిల్లలకు ఈ సినిమా ఒక హెచ్చరిక అని చెప్పొచ్చు. ఒక ఫోన్‌ కారణంగా వ్యక్తుల మధ్య ప్రేమ పెరిగింది. అలాగే ఒక వ్యక్తి ప్రాణాలే పోయే స్థితికి చేరుకున్నాడు. మరొకరికి చీటింగ్‌ జరిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి టెక్నాలజీని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఈ సినిమా ద్వారా దర్శకుడు మరోసారి చెప్పారు.

చిన్నపిల్లాడి కళ్ల ముందే అతడి తల్లిదండ్రులు చనిపోవడం వంటి దయనీయమైన అంశంతో కథను మొదలుపెట్టారు దర్శకుడు. ఆ పిల్లాడు సినిమాలో పగ ప్రతీకారాలతో ఉంటే సినిమా మరోలా ఉండేది. అలా కాకుండా ఆ పిల్లాడు మంచి గుణాలతో పెరుగుతాడు. పెద్దవాళ్లు ఏం చెబితే అదే నేర్చుకుంటాం అనే నీతిని ఈ కథతో మరోసారి తెలియజేశారు. కిరణ్‌ అబ్బవరం చాలా నేచురల్‌గా నటించాడు అని పరుచూరి వివరించారు.

సినిమాలపై పరుచూరి గోపాలకృష్ణ తరచుగా తన ఆలోచనలు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి చెప్పారు. థియేటర్లలో మిశ్రమ ఫలితం అందుకుందని చెప్పిన ఈ సినిమా.. ఓటీటీల్లోనూ మంచి స్పందన సాధించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు పరుచూరి రివ్యూ ఇవ్వడంతో రివ్యూల పర్వం ముగిసింది అని చెప్పాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus