పవన్-క్రిష్ సినిమా.. ఇతరుల జోక్యం ఎక్కువైందా..?

  • February 24, 2021 / 07:12 PM IST

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన సినిమాల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. తను అనుకున్న కథను తెరపై చూపించడానికి తాపత్రయపడుతుంటాడు. స్క్రిప్ట్ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవడం క్రిష్ కి అసలు నచ్చదు. కానీ ఇప్పుడు తన సినిమా విషయంలో అదే జరుగుతోందని సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడని.. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ ఫైనల్ చేశారని సమాచారం.

పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ వారంలో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమా విషయంలో క్రిష్ కి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయని సమాచారం. తన సినిమా విషయంలో పవన్ వైఖరి కాస్త భిన్నంగా ఉంటుంది. పట్టించుకుంటే మొత్తంలో స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంటారు. లేకపోతే దర్శకుడి ఇష్టానికే వదిలేస్తారు. ‘వకీల్ సాబ్’ విషయంలో దర్శకుడి అభిష్టానికే వదిలేశారు. కానీ క్రిష్ సినిమా విషయంలో మాత్రం మెల్లగా జోక్యం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను తన ఆస్థాన రచయితల బృందంతో పవన్ రీరైట్ చేయించాడని టాక్. అలానే నిర్మాత ఏఎం రత్నంకి రచనా విభాగంలో అనుభవం ఉండడంతో.. ఆయన కూడా కొన్ని సన్నివేశాలను రీరైట్ చేస్తున్నారట. ఇలా అందరూ తన స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకోవడం క్రిష్ కి నచ్చడం లేదు. సజెషన్స్ ఇస్తే ఓకే కానీ ఇలానే తీయమని ఆర్డర్లు వేస్తే మాత్రం తన విజన్ బయటకి రాదనేది క్రిష్ టెన్షన్. మరి ఈ పరిస్థితిని క్రిష్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus