ఇటీవల ఎన్టీఆర్ తండ్రి, ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన హరికృష్ణ ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాదాన్ని అటు ఇండస్ట్రీ కానీ.. ఇటు జనాలు కానీ ఇంకా మరువక ముందే మరో అనర్ధం చోటు చేసుకొంది. నిన్న సాయంత్రం తూర్పు గోదావరి పర్యటనలో భాగంగా రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ మీదుగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ను అదే దారిలో వేగంగా వస్తున్న ఓ లారీ ఢీకొంది. అయితే.. అదృష్టం కొద్దీ జనసేనాని కారు దాటిన తర్వాత కాన్వాయ్ ను మాత్రమే ఢీకొంది.
ఆ కాన్వాయ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రయివేట్ సిబ్బంది మాత్రం తీవ్రంగా గాయపడ్డారట. ఈ ప్రమాదంలో ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. అందరికీ చిన్నచిన్న గాయలే అయ్యాయని….ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ తో పాటు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.