Pawan Kalyan: ఆ సినిమా ఆలస్యం పవన్‌ తప్పు కాదా.. చూస్తుంటే అలానే ఉంది!

Advertisement

పవన్‌ కల్యాణ్‌తో సినిమా ప్రారంభించడం మాత్రమే మన చేతుల్లో ఉంది.. సినిమా పూర్తవ్వడం, రిలీజ్‌ అవ్వడం కాదు అంటూ ఇటీవల టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో ఓ ప్రచారం ఉంది. అంటే సినిమా మొదలయ్యాక కొత్త షెడ్యూల్స్‌ ప్రారంభమవ్వడం చాలా కష్టంగా మారింది అనేది వారి మాట. వాళ్లు అన్నట్లుగానే పవన్‌ కూడా రాజకీయం – సినిమా అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తూ.. సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతా మారిపోయింది అనిపిస్తోంది. దీనికి కారణం సినిమాల షెడ్యూల్స్‌ వెంటవెంటనే మొదలవుతుండటం.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ సినిమాల ముచ్చట్లు రోజూ బోలెడన్ని వినిపిస్తున్నాయి. ఈ సినిమా మొదలు, ఆ సినిమా కొత్త షెడ్యూల్‌ అప్పుడు, ఇదిగో ఇది పూర్తయిపోయింది అంటూ వార్తలొస్తున్నాయి. తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ లుక్‌ విడుదలకి ముహూర్తం కుదిరింది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ సినిమాకి పేరు ఖరారైందంటున్నారు. ఇంకోవైపు ‘ఓజీ’ షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతోందట. ఇలా బోలెడన్ని సినిమా విషయాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ సినిమా ఇటీవలే మొదలైంది. ముంబయిలో వారం రోజులుగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్‌ని మరో వారం రోజులపాటు కొనసాగిస్తారట. పవన్‌ కల్యాణ్‌, ప్రియాంక మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర వీడియో ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఉన్న కాస్త కంటెంట్‌తో ఫ్యాన్స్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

అయితే ఇక్కడే మరో విషయం గమనించాలి అంటున్నారు ఫ్యాన్స్‌. అదే ‘హరి హర వీరమల్లు’ సినిమా గురించి. ఆ సినిమా ఆగుతూ, ఆగుతూ షూటింగ్‌ జరుపుకోవడానికి కారణం పవన్‌ అయితే… ఈ సినిమాల షూటింగ్‌ ఇంత వేగంగా ఎందుకు జరుగుతోంది అని అంటున్నారు. ఇదే తరహాలో ఆ సినిమా గురించి కూడా టీమ్‌ పని చేస్తే అది కూడా త్వరలో అయిపోతుంది అని కదా అని చెబుతున్నారు. మరి దీనిపై టీమ్‌ ఏమంటుందో చూడాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus