పవన్ ఓకే అన్నాడంటున్న బండ్ల గణేష్

  • September 28, 2020 / 12:46 PM IST

పవన్ కళ్యాణ్ తో సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు అందరిలో బండ్ల గణేష్ సపరేట్ అని చెప్పుకోవాలి. పవన్ గురించి వివిధ ఫంక్షన్లలో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ప్రొడ్యూసర్ గా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో కూడా బండ్ల గణేష్ సినిమాలు చేశారు. కానీ పవన్ అంటే అతడికి ఎక్కువ అభిమానం. పవన్ తన దేవుడు అని చెబుతూ వుంటాడు.

కొంత గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్ గా పవన్ సినిమాతోనే ఎంట్రీకి బండ్ల గణేష్ రంగం సిద్ధం చేసినట్లు కనబడుతోంది. “నా బాస్ ఓకే అన్నాడు. మరోసారి నా కలలు నిజం అవుతున్నాయి. థాంక్యూ మై గాడ్” అని మండే మార్నింగ్ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేయడంతో పాటు ఆయనను ట్యాగ్ చేశారు. పవన్ తో సినిమా ప్రొడ్యూస్ చెయ్యనున్నట్లు ఇన్ డైరెక్ట్ గా ఇలా పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమా ‘తీన్మార్’. అది హిట్ కాలేదు. దాంతో తనే ప్రొడ్యూస్ చెయ్యాలి అనుకున్న ‘గబ్బర్ సింగ్’ను బండ్లకు ఇచ్చాడు పవన్. అది మంచి లాభాలను తీసుకొచ్చింది. ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ కి డబ్బులు మిగిలాయి. ఇప్పుడు మరోసారి పవన్ తో సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. ప్రెసెంట్ పవన్ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి. అవి కంప్లీట్ అయ్యాక బండ్ల గణేష్ సినిమా వండొచ్చు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus