Pawan Kalyan: స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఇదే?

Advertisement

కరోనా సెకండ్ వేవ్ వల్ల స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ ఆగిపోగా ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు సెట్స్ పైకి వస్తున్నారు. గత కొన్నిరోజులుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రానాతో కలిసి నటిస్తుండగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కే పవన్ పూర్తిగా పరిమితం కానున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాతే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. పవన్ హరీష్ శంకర్ కాంబో మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాదే మొదలు కానుందని తెలుస్తోంది. పవన్ హరీష్ కాంబో మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. క్రాక్, వకీల్ సాబ్ మాత్రమే ఈ ఏడాది రిలీజైన పెద్ద సినిమాలు కాగా వినాయకచవితి, దసరా, క్రిస్మస్, 2022 సంక్రాంతి సీజన్లకు తమ సినిమాలను రిలీజ్ చేయాలని స్టార్ హీరోలు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ 2022 సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 2022 సంక్రాంతికి ఈ సినిమాతో పాటు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్3 సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus