‘వకీల్ సాబ్’ ట్రైలర్ విషయంలో పవన్ సలహాలు!

  • March 27, 2021 / 05:11 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈ క్రమంలో మార్చి 29న సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ ట్రైలర్ రెండు వారాల కిందటే రెడీ అయిపోయింది. దిల్ రాజు సన్నిహితుల వర్గాలు ఎప్పుడో ఈ ట్రైలర్ ను చూశాయి. హీరో పవన్ కళ్యాణ్ కూడా ట్రైలర్ చూశారు. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ సినిమా ‘పింక్’ సినిమాకి రీమేక్ అనే సంగతి తెలిసిందే.

‘పింక్’లో ముగ్గురు అమ్మాయిల పాయింట్ ను మాత్రం తీసుకొని.. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ స్టైల్ లో కమర్షియల్ గా తీశారు. మూడు భారీ ఫైట్లు కూడా యాడ్ చేశారు. కోర్టు సీన్లలో పవన్ మార్క్ డైలాగులు పెట్టారు. అయితే ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్ అందులో ఫైట్ సీన్లు తగ్గించమని చెప్పినట్లు సమాచారం. అన్ని యాక్షన్ సీన్లు వద్దని.. ట్రైలర్ లో హీరోయిజం తగ్గించమని పవన్ చెప్పారట.

ట్రైలర్ ఆరంభించిన తీరు.. ఎండింగ్ చాలా బాగున్నాయని.. మధ్యలో కొన్ని మార్పులు చేయమని పవన్ సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు చేసిన దర్శకుడు కోర్టు డైలాగులు యాడ్ చేసినట్లు తెలుస్తోంది. కోర్టులో అమ్మాయిని ‘నువ్ వర్జినా’ అని ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తే.. దానికి పవన్ కళ్యాణ్ వేసే కౌంటర్ సీన్ ను ట్రైలర్ లో చూపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి!

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus