Pawan Kalyan, Surender Reddy: పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ అలా ఉండబోతుందా?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండగా పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ క్రేజీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీకి వక్కంతం వంశీ రైటర్ గా పని చేస్తున్నారు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్ లో భాగంవా వక్కంతం వంశీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ సురేందర్ మూవీ సోషల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కనుందని ఆయన చెప్పుకొచ్చారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమవుతోందని వక్కంతం వంశీ కామెంట్లు చేశారు. రైటర్ గా ఈ సినిమా తనకు మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందని వక్కంతం వంశీ వెల్లడించారు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ అందరి అంచనాలను అందుకుంటుందని వక్కంతం వంశీ కామెంట్లు చేయడం గమనార్హం. అదే సమయంలో ఏజెంట్ సినిమా గురించి కూడా వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు.

ఏజెంట్ సినిమాను నేను ఇంకా చూడలేదని సినిమాలో ఏముందో నాకు ఇప్పటివరకు తెలియదని పేర్కొన్నారు. ఏజెంట్ సినిమా రిలీజైన సమయంలో నేను షూటింగ్ లో ఉన్నానని ఆయన తెలిపారు. ఏజెంట్ సినిమా టీజర్, ట్రైలర్ తప్ప సినిమాను చూడలేదని వక్కంతం వంశీ కామెంట్లు చేశారు. ఏజెంట్ మూవీని ఓటీటీలో చూడాలని అనుకుంటే ఇప్పటివరకు ఓటీటీలో రాలేదని ఆయన అన్నారు.

నేను స్వయంగా కథ రాసిన మూవీని థియేటర్ లో చూడలేకపోయానని ఇప్పటికీ (Surender Reddy) సురేందర్ రెడ్డితో చెబుతానని వక్కంతం వంశీ తెలిపారు. అయితే వక్కంతం వంశీ కామెంట్లు మాత్రం అస్సలు నమ్మేలా లేవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వక్కంతం వంశీ ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. వక్కంతం వంశీ కెరీర్ ఈ సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus