గత కొన్ని రోజులు ఏపీ రాజకీయాలు – సినిమాల మధ్యలో ఒక చర్చ జరుగుతోంది. అదే పవన్ (Pawan Kalyan) సినిమాల్లోకి ఎప్పుడు మళ్లీ వస్తారు అని. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన చాలా బిజీ అయిపోయారు. అందుకే సెట్స్ మీద ఉన్న సినిమాలు ఇంకొన్ని రోజులు అలానే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే త్వరలో పవన్ కొత్త సినిమాల షూటింగ్‌ను రీ స్టార్ట్ చేస్తారంటున్నారు. ఆయన కూడా నెలలో కొన్ని రోజులు సినిమాలకు ఇస్తా అని కూడా చెప్పారు.
అయితే, ఇప్పుడు ప్రశ్న.. పవన్ ఫస్ట్ స్టార్ట్ చేసే సినిమా ఏది?. ఎందుకంటే పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఎప్పుడో ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ఒకటి కాగా.. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించుకున్న ‘ఓజీ’ (OG Movie) , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) . ఈ మూడింటిలో ఎక్కువ శాతం పూర్తయిన సినిమా ‘ఓజీ’ అని కొదరు.. ‘హరి హర వీరమల్లు’ అని మరికొందరు అంటున్నారు. దీంతో ఈ రెండింటిలో ఓ సినిమా స్టార్ట్ చేసి త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ క్రమంలో ‘ఓజీ’ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘హరి హర వీరమల్లు’ కంటే ‘ఓజీ’ షూటింగే త్వరలో పూర్తయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓ 15 రోజులు కాల్‌షీట్లు ఇస్తే ‘ఓజీ’ సినిమాకు సంబంధించి పవన్ వర్క్ అయిపోతుంది అని చెబుతున్నారు. దీంతో ఈ సినిమాకే పవన్ ఫస్ట్ డేట్స్ ఇస్తున్నాడని.. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసుకుని రిలీజ్ చేసేస్తారు అని చెబుతున్నారు.
సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు నుండి ఉంటుంది అని చెబుతున్నారు. ఈ మేరకు డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారట. సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యాక టీమ్ నుండి ఓ అప్‌డేట్ కూడా వస్తుంది అని చెబుతున్నారు.