Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

‘ఒకటే పని చేసేనాకి.. ఒకేనాక బతికేనాకి ఇంతపెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల.. పుడతామా ఏంటి మళ్లీ’.. ఈ డైలాగ్ గుర్తుందా? ‘పెద్ది’ని ప్రేక్షకులకు తొలి పరిచయం చేయడానికి దర్శకుడు బుచ్చిబాబు సానా వాడుకున్న ఆయుధం. ఆ టీజర్‌లో ఉన్న ఏకైక డైలాగ్‌.. మిగిలిందంతా యాక్షన్‌. కానీ ఈ డైలాగ్‌ బాగా గుర్తుండిపోయింది. కారణం అందులోని పవర్‌. ఇప్పుడు అలాంటి డైలాగ్‌ మరొకటి బయటకు వచ్చింది. సినిమా మేకింగ్‌ వీడియోలో ఈ డైలాగ్‌ బయటకొచ్చింది.

Peddi

‘ఎగస్పార్టీకి ధూపమెయ్యాలంటే ఈ మాత్రం మంటెట్టాల్లేరా!’… డైలాగ్‌ భలేగా ఉంది కదా. ఈ డైలాగ్‌ ‘పెద్ది’ సినిమాలో ఉండబోతోంది. అదేంటి సినిమా రిలీజ్‌కి ముందే ఇంత మంచి డైలాగ్‌ బయటకు చెప్పేశారా.. అంటే చెప్పేశారు. దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం కొన్ని ఫొటోలు, వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అందులోనే ఈ డైలాగ్‌ఉంది. వీడియో లాస్ట్‌లో రామ్‌చరణ్‌ ఈ డైలాగ్‌ చెప్పాడు. మామూలుగా అయితే థియేటర్లలో విజల్స్‌, కేకలు మారుమోగే డైలాగ్‌ ఇది. కానీ సోషల్‌ మీడియాలో కాబట్టి లైక్‌లు మారుమోగుతున్నాయి.

ఈ పోస్ట్‌తో రిలీజ్‌ చేసిన ఓ ఫొటోలో బ్యాటు పట్టుకుని రామ్‌చరణ్‌ ఓ సీరియస్‌ లుక్‌ ఇస్తూ కనిపించాడు. ఆ లుక్‌ ఎలా ఇవ్వాలో బుచ్చిబాబు పక్కనే కూర్చుని చూపించారు. ‘పెద్ది’ విత్‌ ‘పెద్ది’ క్రియేటర్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్య అంశాలతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్‌ డ్రామా చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది.

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే మార్చి 27న విడుదలై ఉండేది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ఆ సమయానికి అవ్వవు అని.. సినిమాను ఏప్రిల్‌ 30కి తీసుకెళ్లిపోయారు. చరణ్‌ వదిలేసిన డేట్‌ను బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌తో ఫిల్‌ చేయడంతో అభిమానులు ఖుష్‌ అయిపోయారు. మరి ‘పెద్ది’ బాక్సాఫీసుకు దూల తీర్చి… ధూపం వేసే రోజు కోసం మీరు రెడీనా?

నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus