Chiranjeevi: చిరంజీవి గురించి ఒకప్పటి విలన్ పొన్నాంబళం.. ఆసక్తికర కామెంట్లు!

  • May 23, 2023 / 06:10 PM IST

ఒకప్పటి విలన్ పొన్నాంబళం తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.వినడానికి ఈయన పేరు కొత్తగా ఉందేమో కానీ.. ఒకసారి చూస్తే ‘ఈయనా..!’ అంటారు. గతంలో చాలా తెలుగు సినిమాల్లో విలన్ గా నటించారు పొన్నాంబళం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ ‘హిట్లర్’, పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’, బాలకృష్ణ నటించిన ‘వీరభద్ర’, రజినీకాంత్ నటించిన ‘భాషా’, ‘ముత్తు’ వంటి చిత్రాల్లో నటించారు. మొన్నామధ్య ఈయన అనారోగ్యం పాలై మెరుగైన చికిత్స కోసం ఆర్థిక సాయం కోరుతూ ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో పొన్నాంబళం.. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉండగా… కమల్ హాసన్, చిరంజీవి వంటి స్టార్ హీరోలు ఆయనకు సాయం చేశారు. తర్వాత పొన్నాంబళం కోలుకుని నార్మల్ అయ్యారు. తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.”మాది చాలా పెద్ద ఫ్యామిలీ .. నా ఫాదర్ చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం నాపై పడింది. కొన్ని ఉద్యోగాలు చేశాను.

సినిమాలపై గల ఇంట్రెస్ట్ తో ఇటువైపు వచ్చాను. తెలుగులో నా ఫస్ట్ మూవీ ‘ఘరానా మొగుడు’.1991 లో వచ్చిన ఆ సినిమాలో ఓ ఫైట్ కోసం నన్ను అడిగితే, పారితోషికంగా లక్ష రూపాయలు అడిగాను. అంత అమౌంట్ అడిగానని తెలిసి హీరో చిరంజీవే షాక్ అయ్యారు. నా ఫైట్ ఎలా ఉంటుందనేది చూసిన తర్వాతే డబ్బులు ఇవ్వండి అని నిర్మాతలతో చెప్పాను.

అలాగే ఫైట్ బాగా వచ్చిందని చెప్పి నన్ను అభినందించి మరీ నాకు లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ సినిమా 175 రోజులు ఆడింది. ఆ తర్వాత చిరంజీవి గారు కాల్ చేసి ఆఫీస్ కి వెళ్లి కలవమన్నారు. అక్కడికి వెళితే వాళ్లు నాకు 5 లక్షలు ఇచ్చారు. తర్వాత సినిమాకి అడ్వాన్స్ అనుకున్నాను. కానీ గిఫ్ట్ గా చిరంజీవి (Chiranjeevi) గారు ఇవ్వమని చెప్పారని తెలిసి నేను షాక్ అయ్యాను” అంటూ పొన్నాంబళం చెప్పుకొచ్చారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus