Ponniyin Selvan2 Twitter Review: ‘పీఎస్-2’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • April 28, 2023 / 12:23 PM IST

స్టార్ డైరెక్టర్ మణిరత్నం.. డ్రీం ప్రాజెక్ట్ అయిన.. ‘పొన్నియన్ సెల్వన్’ ను రెండు భాగాలుగా రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘పీఎస్-1 ‘ పేరుతో గత ఏడాది రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ మూవీ డీసెంట్ హిట్ అందుకుంది. మిగిలిన భాషల్లో కూడా పర్వాలేదు అనిపించుకుంది. తమిళంలో మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ‘పీఎస్-2 ‘ పై ఆసక్తిని కలిగించేలా ఎండింగ్ ఇచ్చి పార్ట్ 2 పై ఆసక్తిని పెంచాడు మణిరత్నం.

తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అవుతున్న (Ponniyin Selvan2) ‘పీఎస్-2’ ని చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం చూస్తే : ‘పీఎస్2’ రన్ టైం ఏకంగా 2 గంటల 44 నిమిషాలు ఉండటంతో చాలా విసుగొచ్చింది అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని హై మూమెంట్స్ ఉన్నా..

సెకండ్ హాఫ్ లో మాత్రం బోరింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని. మరోసారి టెక్నికల్ గా మణిరత్నం తన సత్తా చాటుకున్నాడని. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుందని, పాటలు మాత్రం బాలేదని అంటున్నారు. విక్రమ్, జయం రవి ల కంటే కూడా కార్తి తన నటనతో మ్యాజిక్ చేశాడని. త్రిషతో అతని రొమాంటిక్ సన్నివేశాలు బాగా వచ్చాయని అంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి :

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus