Pooja Hegde: సోషల్‌ మీడియా షేకింగ్‌ వెనుక సీక్రెట్‌ చెప్పిన పూజా.. ఏమందంటే?

  • May 23, 2023 / 02:55 PM IST

హీరోయిన్లు – ఫ్యాషన్‌.. ఈ రెండూ వేర్వేరు పదాలు కావు.. దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఎందుకంటే హీరోయిన్లకు నటన ఎంత అవసరమో, ఫ్యాషన్‌ సెన్స్‌ కూడా అంతే అవసరం అని ఇటీవల కాలంలో మారిన పరిస్థితులు చెబుతున్నాయి. దానికి తగ్గట్టే నాయికలు కూడా తమలోని ఫ్యాషన్‌ టాలెంట్‌ని సోషల్‌ మీడియా వేదికగా బలంగా చూపిస్తున్నారు కూడా. అలాంటి వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఓపెన్‌ చేసి అలా స్క్రోల్‌ చేస్తే చాలా విషయాలు తెలిసిపోతాయి.

ఇదే విషయం పూజా హెగ్డే దగ్గర ప్రస్తావిస్తే ఆస్తక్తికర సమాధానం చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. సౌకర్యం ఎంత ఎక్కువగా ఉంటే ఫ్యాషన్‌ అంత బాగుంటుందని సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేసింది పూజా హెగ్డే. మన ఆలోచనలకు, శరీరానికి తగ్గట్టుగా ఉండే దుస్తులు సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అలా ధరించిన డ్రెస్‌లు సౌకర్యంగా ఎప్పుడు అనిపిస్తాయో… అప్పుడు అవి కొత్తగా అనిపిస్తాయి. అంతేకాదు మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి అని చెప్పింది.

తానెప్పుడూ కొత్తగా కనిపించడానికే ఇష్టపడతానని, బ్రాండ్స్‌కి, డిజైన్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటానని తన ఫ్యాషన్‌ రహస్యం ఏంటో చెప్పేసింది. తద్వారా సోషల్‌ మీడియాలో ఎలా ఎప్పుడు ట్రెండీ, వైరల్‌గా ఉంటున్నానో కూడా చెప్పేసింది. దీంతో ఇదన్నమాట బుట్టబొమ్మ ట్రెండింగ్‌ సీక్రెట్‌ అని అంటున్నారు నెటిజన్లు. అమ్మాయిలు అయితే ఓసారి పూజ ఏం చెప్పిందో ట్రై చేసి చూద్దాం అని అనుకుంటున్నారు. ఇక పూజా హెగ్డే సినిమాల సంగతి చూస్తే..

వరుసగా అగ్ర హీరోల సినిమాలు చేస్తూ వచ్చిన (Pooja Hegde) పూజ, ఇటీవల పరాజయాలు వరుస కట్టేసరికి ప్లానింగ్‌ మార్చింది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు వదులుకుంది కూడా. ప్రస్తుతం మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాలో మాత్రమే చేస్తోంది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుండి తప్పుకుంది. విజయ్‌ దేవరకొండ – పూరి జగన్నాథ్‌ ‘జేజీఎం’ ఆగిపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ లైనప్‌ నుండి వెళ్లిపోయింది. త్వరలో మరికొన్ని పెద్ద సినిమాలు ఓకే చేయబోతోంది అని టాక్‌.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus