పూజా హెగ్దే సీక్రెట్ ప్రేమాయణం బయటపడిందా..!

  • January 18, 2020 / 11:38 AM IST

ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్దే టైం ఓ రేంజ్ లో నడుస్తుంది. వరుసగా ‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘గద్దల కొండ గణేష్’ ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ వంటి హిట్లు అందుకుని మంచి ఫామ్ లో ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ.. మరోసారి బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో జతకట్టబోతుందని సమాచారం.

గతంలో ఈమె హృతిక్ రోషన్ ‘మహోంజదారో’ చిత్రంతోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఇటీవల ఈమె నటించిన ‘గోల్ మాల్ 4’ హిట్ అవ్వడంతో మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈమె ఓ స్టార్ సన్ తో ప్రేమాయణం నడుపుతుంది అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ అమ్మడు హృతిక్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు రోహన్ మెహరా తో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంత వరకూ నిజముందో పూజ నే క్లారిటీ ఇవ్వాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus