Pooja Hegde: పూజ.. చెయ్యక చెయ్యక చేస్తే.. కష్టం వేస్ట్ అయిపోయింది..!

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే (Pooja Hegde) . ఆ తర్వాత వరుణ్ తేజ్ (Varun Tej) ‘ముకుంద’ (Mukunda)  సినిమాలో కూడా నటించింది. అయితే ఆమెకు బ్రేక్ వచ్చింది ‘డిజె- దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) సినిమాతోనే అని చెప్పాలి. ఆ సినిమాలో పూజ చేసిన గ్లామర్ షో.. బాలీవుడ్ ను సైతం షేక్ చేసింది. అందుకే ఆమెకు వరుసగా పెద్ద హీరోల సినిమాలో ఛాన్సులు వచ్చాయి అని చెప్పాలి. అయితే ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) నుండి పూజని వరుసగా ప్లాపులు వెంటాడుతూ వస్తున్నాయి.

Pooja Hegde

దీంతో రూటు మార్చి ‘రెట్రో’(Retro)  చేసింది. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పటివరకు పూజా హెగ్డే ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసింది. దీంతో వరుసగా స్టార్ హీరోల సరసన పెద్ద సినిమాల్లో నటించే ఛాన్సులు అందిపుచ్చుకుంది. కానీ తొలిసారి పంధా మార్చి ‘రెట్రో’ చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సూర్య(Suriya) సరసన ఆమె డీగ్లామర్ రోల్ చేసింది. రుక్మిణి అలియాస్ రుక్కు అనే పాత్రలో చాలా నేచురల్ గా కనిపించింది.

పెర్ఫార్మన్స్ పరంగా కూడా కొత్తగా అనిపించింది. తొలిసారి పూజా నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు చేసిన ప్రయత్నం ఇది అనుకోవాలి. తన వరకు పాత్ర కోసం బాగానే కష్టపడి చేసింది. కాకపోతే డైరెక్షన్ వీక్ గా ఉండడం వల్ల ఆమె నటనకి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు అనే చెప్పాలి. కొంతమంది అయితే పూజా హెగ్డే ప్లాప్ జర్నీ కంటిన్యూ అవుతుంది అంటూ తక్కువ చేసి కామెంట్స్ చేస్తుండటం బాధాకరం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus