Pooja Hegde, Mahesh Babu: పూజా హెగ్డే ఈ వార్తల గురించి క్లారిటీ ఇస్తారా?

  • July 7, 2022 / 03:25 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డేకు 2022 సంవత్సరం అస్సలు కలిసిరాలేదు. పూజా హెగ్డే నటించి ఈ ఏడాది విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. అయితే మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికయ్యారనే సంగతి తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే మహేష్ సినిమాకు పూజా హెగ్డే షరతులు పెట్టారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ ను కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలని త్రివిక్రమ్ కు పూజా హెగ్డే సూచించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కేవలం 45 రోజుల కాల్షీట్స్ ను మాత్రమే కేటాయిస్తానని ఆమె చెప్పారని బోగట్టా. ఈ సినిమాకు పూజా హెగ్డే రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని స్టాఫ్ కు నిర్మాతలే శాలరీ చెల్లించాల్సి ఉంటుందని ఈ షరతును కూడా పూజా హెగ్డే విధించారని ప్రచారం జరుగుతోంది.

వైరల్ అవుతున్న వార్తలు విని పూజా హెగ్డే అభిమానులు సైతం షాకవుతున్నారు. పూజా హెగ్డే అలాంటి షరతులు విధించరని ఆమె గురించి కావాలని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ అవుతున్న వార్తల గురించి పూజా హెగ్డే క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు పూజా హెగ్డే కథ, పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వైరల్ అవుతున్న వార్తల గురించి పూజా హెగ్డే స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఫలితం పూజా హెగ్డే కెరీర్ పై ప్రభావం చూపనుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే పూజా హెగ్డేకు స్టార్ హీరోల సినిమాలకు పని చేసే ఛాన్స్ అయితే దక్కనుందని చెప్పవచ్చు. పూజా హెగ్డే కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus