Pooja Hegde, Suriya: పూజాహెగ్డే లిస్ట్ లో మరో సినిమా!

  • July 6, 2022 / 11:21 AM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ రేంజ్ కి దూసుకుపోయింది పూజాహెగ్డే. ఆమె నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఒక్కో సినిమాకి రెండున్నర కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది. సల్మాన్ తో ‘కభీ ఈద్ కభీ దివాలి’, రణవీర్ సింగ్ తో ‘సర్కస్’ సినిమాలు చేస్తోంది. అలానే విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘జనగణమన’ సినిమా ఓకే చేసింది.

ఇప్పుడు ఈ బ్యూటీ లిస్ట్ లో మరో సినిమా వచ్చి చేరింది. తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళ సినిమాలు చేయడం కూడా మొదలుపెట్టింది పూజా. నిజానికి ఆమె కోలీవుడ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ తెలుగులో సెటిల్ అయింది. రీసెంట్ గా విజయ్ ‘బీస్ట్’తో కోలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సూర్య సినిమాలో ఆమెకి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్నట్లు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి.

కానీ శివ తెరకెక్కించిన ‘అన్నాత్తే’ సినిమా ప్లాప్ అవ్వడంతో సూర్య సినిమా ఉండదని అందరూ అనుకున్నారు. కానీ సూర్య మాత్రం శివతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇందులో పూజాహెగ్డేను హీరోయిన్ గా అనుకుంటున్నారు. అదే గనుక నిజమైతే పూజా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లే. అయితే ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించనున్నారని మరో వార్త చక్కర్లు కొడుతోంది.

ఇది సూర్య స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్ అని.. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతుందని టాక్. మరి దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఒకవేళ తెలుగులో తెరకెక్కించినా.. తమిళ, మలయాళ భాషల్లో కచ్చితంగా రిలీజ్ చేస్తారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus