ఆమెకు కనీస బాధ్యత కూడా లేదు : పూనమ్

  • March 23, 2020 / 10:48 PM IST

కరోనా వైరస్ వల్ల ఇప్పుడు ఇండియా మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తం గజ గజ వణికిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ అంటూ ఎవ్వరూ ఇంటి బయటకి రావొద్దు అంటూ ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎవ్వరూ ఇళ్లలో నుండీ బయటకి రాకుండా పోలీసులు కూడా ఎంతో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల నుండీ వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసాయి.

అయితే ఈ క్రమంలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ మాత్రం ఇతరుల ఆరోగ్యాన్ని, ప్రాణాలని లెక్క చేయకుండా లండన్ నుండీ రాగానే పార్టీలు, పబ్బుల అంటూ తిరిగేసింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడానికి ముందు వరకూ దాదాపు 400 మందితో పార్టీలో పాల్గొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెని దుమ్మెత్తిపోస్తూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేసారు. ఇక పూనమ్ కౌర్ కూడా కూడా మీ పై ట్వీట్ చేసింది. ” కనీసం భాద్యత అనేది లేకుండా కేవలం తన సుఖాన్ని, సంతోషాన్ని మాత్రమే చూసుకుంటూ…తిరగడం అమానుషం. డబ్బు, పవర్ ఉంది అంటే మరింత భాద్యతగా వ్యవహరించాలి. ‘కనికా కపూర్ ఓ క్రిమినల్’ అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus