Prabhas,Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ముహూర్తం గెస్ట్‌లు వీళ్లే!

Advertisement

ఇటీవల కాలంలో సినిమా అనౌన్స్‌మెంట్‌ కాకుండా విపరీతమైన పుకార్లు వచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే… అది ప్రభాస్‌ – మారుతి సినిమా అనే చెప్పాలి. అనుకుంటున్నారట అంటూ మొదలైన ఈ పుకార్ల వరుస ఇప్పుడు ఏకంగా ఓపెనింగ్‌ డేట్‌ వరకు వచ్చేసింది. అవును సినిమా ఓపెనింగ్‌ డేట్‌ ఇదే అంటూ ఓ తేదీ బయటికొచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఆరు రోజుల్లో సినిమాను స్టార్ట్‌ చేస్తారట. అతిరథమహారథుల మధ్య సినిమాకు కొబ్బరికాయ కొడతారని వార్తలొస్తున్నాయి.

Click Here To Watch NOW

డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతుంది అంటూ ఊసులు మొదలైన ప్రభాస్‌ – మారుతి సినిమాకు ఈ నెల 10న ముహూర్తపు షాట్‌ పడుతుందట. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఆయనతోపాటు రాజమౌళి కుటుంబం కూడా హాజరవుతుంది అని సమాచారం. అఫీషియల్‌గా సినిమా గురించి బయటకు చెప్పకపోయినా ప్ర‌స్తుతం మారుతి క‌థ‌కి తుదిమెరుగులు దిద్దే ప‌నిలో ఉన్నారట. సినిమాకు తొలుత ‘రాజా డీలక్స్’ అనే పేరు అనుకున్నట్లు వార్తలొచ్చాయి.

అయితే ఆ టైటిల్‌ వేరొకరి దగ్గర ఉందని టాక్‌. దీంతో పేరు మారుస్తున్నారట. ఇప్పటివరకు వచ్చిన పుకార్ల ప్రకారం చూస్తే ఇదో హార‌ర్ కామెడీ సినిమా అని తెలుస్తోంది. బొమ‌న్ ఇరానీ ఈ సినిమాలో దెయ్యాల రాజుగా కనిపిస్తాడట. అనుకోని పరిస్థితుల్లో ఓ దెయ్యాల బంగ్లాలోకి వెళ్లిన హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ అట. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఓవైపు కథ సిద్ధమవుతుండగా, మరోవైపు నగరంలో ప్రత్యేకమైన సెట్స్‌ వేస్తున్నారట.

వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి, విడుదల చేయాలనేది టీమ్‌ ఆలోచనట. ఇందులో హీరోయిన్లు వీళ్లే అంటూ రకరకాల పేర్లు వినిపించినా.. ఇంకా ఎవరూ ఓకే కాలేదంటున్నారు. శ్రీలీల, మాళవిక మోహనన్‌ పేర్లు పక్కా అని అన్నారు. ఇంకో హీరోయిన్‌గా పూజ హెగ్డే, శ్రద్ధ కపూర్‌ పేర్లు వినిపించాయి. అయితే ఈ మధ్య అనుష్క పేరు కూడా చర్చలోకి వచ్చింది. మరి ఎవరిని తీసుకుంటారో ముహూర్తం రోజు తెలుస్తుంది అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus