Prabhas: రాధేశ్యామ్ ఫ్లాప్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేదన ఇదే!

  • March 18, 2022 / 07:17 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ మృదు స్వభావి అనే సంగతి తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ తన వల్ల ఇతరులు హర్ట్ కాకుండా జాగ్రత్త పడతారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే సహాయం చేసే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారు. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. బాహుబలి సిరీస్ ద్వారా దేశవిదేశాల్లో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

Click Here To Watch Now

తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలివారం కలెక్షన్లు 82 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. సినిమా రిలీజైన రోజున ప్రేక్షకుల నుంచి ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే భారీగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మాత్రం ప్రేక్షకులకు నచ్చేలా రాధేశ్యామ్ మూవీ ఉంది. అయితే ప్రభాస్ సినిమా గురించి సినీ ప్రముఖులలో ఎవరూ పాజిటివ్ గా పోస్టులు పెట్టలేదు. ప్రముఖ హీరోలు, ప్రముఖ దర్శకులు రాధేశ్యామ్ సినిమాలో తమకు నచ్చిన విషయాల గురించి పోస్టులు పెట్టి ఉంటే సినిమాకు కచ్చితంగా హెల్ప్ అయ్యేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కొంతమంది సెలబ్రిటీలు రాధేశ్యామ్ గురించి పాజిటివ్ గా పోస్టులు పెట్టినా ఆ సంఖ్య మరీ తక్కువగా ఉంది. సెలబ్రిటీలు రాధేశ్యామ్ ను కొంతమేర ప్రమోట్ చేసి ఉంటే ఈ సినిమాకు కచ్చితంగా అంతోఇంతో ప్లస్ అయ్యేది. ప్రభాస్ ఎన్నో చిన్న సినిమాలకు సపోర్ట్ చేసి ఆ సినిమాల విజయాలకు కారణమయ్యారు. అయితే ప్రభాస్ విషయంలో మాత్రం ఇతర సెలబ్రిటీలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఒక విధంగా ప్రభాస్ ను మోసం చేశారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంలో తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ప్రభాస్ సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సలార్ మూవీ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus