Prabhas: సలార్ మేకర్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే?

  • July 16, 2022 / 07:59 PM IST

బాహుబలి2 సినిమా సాధించిన రికార్డులు ప్రభాస్ అభిమానుల సంతోషానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాయి. బాహుబలి2 సినిమా తర్వాత కూడా ప్రభాస్ తన సినిమాలతో విజయాలను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు భిన్నమైన ఫలితాలను అందుకున్నాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల రాధేశ్యామ్ మేకర్స్ కు నష్టం కలగగా రిలీజైన తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఈ సినిమాకు నష్టాలు మరింత పెరిగాయి.

సలార్ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా రికార్డులు సెట్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే సలార్ మేకర్స్ మాత్రం ప్రభాస్ అభిమానులకు షాకిస్తున్నారు. రికార్డులు సెట్ చేయాలనే కసితో ప్రభాస్ ఫ్యాన్స్ ఉండగా సలార్ మేకర్స్ మాత్రం ఇంకా ప్రమోషన్స్ ను మొదలుపెట్టలేదు. సలార్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్2 అంచనాలకు మించి విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

సలార్ మేకర్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సలార్ టీజర్ కోసం ప్రభాస్ పుట్టినరోజు వరకు ఎదురుచూడలేమని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ రేంజ్ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో మారిపోయింది. తర్వాత సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తారనడంలో సందేహం అవసరం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో ప్రభాస్ కావడం గమనార్హం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus