Prabhas: హను రాఘవపూడికి ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే.. అలాంటి సీన్స్ వద్దంటూ?

  • August 21, 2024 / 10:08 AM IST

ప్రభాస్ (Prabhas) హను రాఘవపూడి (Hanu Raghavapudi)  కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ వినిపిస్తుండగా రాబోయే రోజుల్లో మేకర్స్ ఇదే టైటిల్ ను ప్రకటిస్తారో లేక మరో టైటిల్ ను ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది. ఇమాన్వీ ఇస్మాయిల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఇమాన్వీ లుక్స్ కు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మైత్రీ, టీ సిరీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Prabhas

అయితే సీతారామం (Sita Ramam) మూవీ క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోతుందనే సంగతి తెలిసిందే. సీతారామం సినిమా విషయంలో అలా చేయడానికి గల కారణాలను హను రాఘవపూడి వెల్లడించినా ప్రభాస్ సినిమాల విషయంలో అలాంటి రీజన్లను ఫ్యాన్స్ అస్సలు అంగీకరించరనే సంగతి తెలిసిందే. మరోవైపు హను రాఘవపూడి సినిమాల్లో ఫస్టాఫ్ అద్భుతంగా ఉన్నా సెకండాఫ్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారనే విమర్శ ఉంది.

ఆ విమర్శకు సైతం సీతారామంతో చెక్ పెట్టిన హను రాఘవపూడి ప్రభాస్ సినిమా విషయంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా వార్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ సైతం జరుగుతోంది. ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్లు రానున్నాయి. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటున్న హను రాఘవపూడి బెస్ట్ స్క్రిప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మైత్రీ నిర్మాతలు వరుసగా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో నంబర్ వన్ గా నిలుస్తున్నారు.

లోకేశ్‌ యూనివర్స్‌లోకి మరో స్టార్‌ హీరో?.. హీరోగానేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus