Aamir Khan, Lokesh Kanagaraj: లోకేశ్‌ యూనివర్స్‌లోకి మరో స్టార్‌ హీరో?.. హీరోగానేనా?

కొన్ని కాంబినేషన్ల గురించి వినగానే.. బ్లాక్‌బస్టర్‌ వైబ్స్‌ అలా కనిపించేస్తుంటాయి. ఎందుకంటే ఆ హీరో, దర్శకుడు గత సినిమాలు ఆ రేంజిలో విజయం అందుకుని ఉంటాయి. అలాంటి ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనే అంచనా బొమ్మ అప్పటికే అభిమానుల మైండ్‌లో గిర్రున తిరిగేస్తూ ఉంటుంది. ఇది ఒక్కోసారి మొత్తం ఇండియన్‌ సినిమా ప్రేక్షకులకు కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అంటే అతిశయోక్తి కాదు. సోషల్‌ మీడియాను ఫాలో అవుతున్నవాళ్లు అయితే..

Aamir Khan, Lokesh Kanagaraj

అంతలా వైబ్స్‌ ఇచ్చే కాంబినేషన్‌ ఏంటో మీరు కూడా చెప్పేయొచ్చు. ఆదివారం సాయంత్రం అనుకుంటాం.. ఈ టాపిక్‌ మీద చర్చ మొదలైంది. ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. ఆ కాంబినేషనే ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) – లోకేశ్ కనగరాజ్‌(Lokesh Kanagaraj) . లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ పేరుతో వరుస విజయాలు అందుకుంటున్న లోకేశ్‌.. త్వరలో ఆమిర్‌ ఖాన్‌తో ఓ సినిమా చేస్తారు అని టాక్‌. మామూలుగా అయితే ఈ విషయం నమ్మలేం. అయితే, ఇప్పుడు బాలీవుడ్‌ హీరోల ఆలోచన మారిపోయింది. అయితే సినిమాలు, లేదంటే కథలు..

ఇంకా లేదంటే ఇక్కడికొచ్చి పాత్రలు చేస్తున్నారు మరి. అలా ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌తో లోకేశ్‌ ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని టాక్. 2018 నుండి సరైన విజయాలు లేని ఆమిర్‌ ఖాన్‌ ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ ట్రాక్‌ ఎక్కాలని అనుకుంటున్నాడు. దీనికి తన ఫ్రెండ్స్‌ షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) , సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) కాన్సెప్ట్‌నే ఆమిర్‌ వాడుతున్నాడు అని చెప్పొచ్చు.

‘జవాన్‌’ (Jawan) సినిమాతో అట్లీని (Atlee Kumar) నమ్ముకున్న షారుఖ్‌ ఖాన్‌ ఎలాంటి విజయం అందుకున్నాడో మీకు తెలిసిందే. ఇక చాలా ప్రయత్నాలు చేసి మురుగదాస్‌తో ఇప్పుడు నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు సల్మాన్‌ ఖాన్‌. ఆమిర్‌ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. దీంతో ఈసారి రూ. 1000 కోట్ల బ్లాక్‌బస్టర్‌ ఈసారి పక్కా అని అభిమానులు అంచనా వేస్తున్నారు.

నేషనల్‌ అవార్డుపై పెద్ద ఎత్తున విమర్శలు.. సూపర్‌ రిప్లై ఇచ్చిన నిత్య

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus