Kalki 2898 AD Censor Review: ప్రభాస్ కల్కి సెన్సార్ టాక్ అదుర్స్.. ఆ ట్విస్టులు వేరే లెవెల్!

  • June 19, 2024 / 10:24 AM IST

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమా రిలీజ్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే అమరావతిలో జరుగుతుందని లేదంటే హైదరాబాద్ లో జరుగుతుందని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాదాపుగా మూడు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కల్కి మూవీ ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని సెన్సార్ సభ్యులు చెబుతున్నట్టు తెలుస్తోంది.

భైరవ పాత్రలో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ తో ప్రభాస్ అదరగొట్టారని ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్లు ఊహలకు అందని విధంగా సరికొత్త అనుభూతిని అందించేలా ఉండనున్నాయని తెలుస్తోంది. యూ/ఏ సర్టిఫికెట్ ను ఈ సినిమా సొంతం చేసుకోగా ఆసక్తికర ట్విస్టులతో కథనం అద్భుతంగా ఉండేలా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంత చిన్న వయస్సులో హాలీవుడ్ లెవెల్ విజువల్ వండర్ ను తెరకెక్కించారని సెన్సార్ సభ్యుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కల్కి 2898 ఏడీ నచ్చుతుందని తెలుస్తోంది. సినిమాలో వావ్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సినిమాలో ప్రభాస్ పాత్ర నవరసాలు పలికిస్తుందని భోగట్టా. కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఇంతకాలం ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ సినిమా రిజల్ట్ రూపంలో ఫలితం దక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఓవర్సీస్ లో సైతం కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సరికొత్త మార్క్ ను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus