Prabhas: ‘ఆదిపురుష్’ రిజల్ట్ తో ప్రభాస్ కి సంబంధం లేదా.. ఏమైందంటే..!

  • July 21, 2023 / 12:33 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పై మొదటి నుండి పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండీ రిలీజ్ వరకు ఎన్నో ట్రోల్స్ వెల్లువెత్తాయి అని చెప్పాలి. మొత్తంగా ఈ సినిమాకి మొదట యావరేజ్ టాక్ వచ్చింది.

ఓపెనింగ్స్ అయితే ఓ రేంజ్లో నమోదయ్యాయి. టాక్ తో సంబంధం లేకుండా దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ‘ఆదిపురుష్’ మూవీ. ప్రభాస్ లుక్స్ పై కూడా భయంకరమైన ట్రోల్స్ వచ్చాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్ప ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ప్రభాస్ పెద్దగా ప్రమోట్ చేసింది లేదు. అయితే కామిక్ కాన్ 2023 ఈవెంట్ లో భాగంగా ప్రభాస్ (Prabhas) నటించిన ‘ప్రాజెక్టు కె’ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే అక్కడ ‘ప్రాజెక్టు కె’ టీం అంతా సందడి చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ ఓ మీడియా ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేయగా మొదట ఓపిగ్గా సమాధానం చెప్పగా.. తర్వాత ‘ఆదిపురుష్’ రిజల్ట్ గురించి ప్రశ్నించే సరికి ప్రభాస్ మొహం తిప్పేసుకుంది. ‘ఇట్స్ హాపెండ్’ అంటూ చెప్పి మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడట. సో ప్రభాస్.. ‘ఆదిపురుష్’ రిజల్ట్ తో సంతృప్తిగా లేడని స్పష్టమవుతుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus