హాలీవుడ్ రేంజ్ సినిమాలో ప్రభాస్.. ఫ్యాన్స్ కే కాదు మొత్తం తెలుగు ప్రేక్షకులకి పండగే…!

  • February 27, 2020 / 01:33 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాహుబలి రేంజ్ హిట్ వచ్చింది ఆ మార్కెట్ ను వాడేసుకుని ఏడాదికి ఓ 4 కమర్షియల్ సినిమాలు చేసేసి రెండు చేతులారా సంపాదించవచ్చు. ప్రభాస్ ఊ అంటే ఎంతో మంది టాప్ డైరెక్టర్ లు … నిర్మాతలు క్యూలు కట్టేసి రెడీగా ఉంటారు. కాని ప్రభాస్ అలా చేయడం లేదు. పాన్ ఇండియా సినిమాలు ఒప్పుకుంటూ తెలుగు సినిమా రేంజ్ ను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. రెండేసి సంవత్సరాలు చొప్పున ఒళ్ళు నలిగిపోయేలా కష్టపడుతున్నాడు. ‘సాహో’ తెలుగులో ప్లాప్ అయ్యింది.. కానీ హిందీలో అలాగే జపాన్ లో హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్న ప్రభాస్ .. ఆ తరువాత ‘మహానటి’ డైరెక్టర్ తో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు.

ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇలాంటి సినిమాలు హిందీలో హృతిక్ రోషన్ చేసాడు. ‘కోయి మిల్ గయా’ ‘క్రిష్’ వంటి చిత్రాలు సూపర్ హిట్ లు గా నిలిచాయి. తరువాత వచ్చిన ‘క్రిష్ 3’ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా … భారీ కలెక్షన్లను రాబట్టి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇలాంటి సినిమాలకి ఎప్పటికీ ఆదరణ దక్కుతుంది అనేది చాలా మంది నమ్మకం. ఇప్పుడు నాగ్ అశ్విన్ అదే తరహాలో ప్రభాస్ ను చూపిస్తే మాత్రం… ప్రభాస్ అభిమానులకే కాదు మిగిలిన తెలుగు ప్రేక్షకులకి కూడా ఫుల్ ఫీస్ట్ అనే చెప్పాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus