Prabhas: అభిమానుల రిక్వెస్ట్ ఇదే.. స్టార్ హీరో ప్రభాస్ పట్టించుకుంటారా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అభిమానులకు తాజాగా అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటానని ఆయన అన్నారు. కుదిరితే మూడు సినిమాలను కూడా ఒకే ఏడాదిలో విడుదలయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్ కొన్ని విషయాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కథల ఎంపిక విషయంలో, డైరెక్టర్ల ఎంపిక విషయంలో మాత్రం ప్రభాస్ పొరపాట్లు చేయకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ వేగంగా సినిమాలలో నటించడంతో పాటు క్వాలిటీ సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా విజయాలు దక్కేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ సోలో హీరోగానే కెరీర్ ను కొనసాగించాలని మల్టీస్టారర్ సినిమాలలో నటించకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తమ కామెంట్లను ప్రభాస్ పట్టించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తర్వాత సినిమాలతో ప్రభాస్ మార్కెట్ రెట్టింపు కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్ (Prabhas) రాజమౌళి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వస్తే చూడాలని ఉందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల బడ్జెట్ సైతం ఒకింత ఎక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus