ప్రభాస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ భారీ ప్లానింగ్‌ చూశారా!

  • August 20, 2021 / 02:00 PM IST

ఇండస్ట్రీలోకి యూవీ క్రియేషన్స్‌ అడుగుపెట్టిన ఆరేళ్లు దాటిపోతోంది. ఈ క్రమంలో చాలా సినిమాలు చేస్తూ వచ్చింది. అందులో భారీ చిత్రాలు అంటే సొంత హీరో ప్రభాస్‌తోనే ఎక్కువగా చేసింది. మిగిలిన టాలీవుడ్‌ హీరోలతో సినిమాలు చేసినా స్టార్‌ హీరోలతో కాదు. అయితే చాలా రోజుల నుండి స్టార్‌ హీరోతో సినిమా చేయాలని యూవీ క్రియేషన్ష్‌ టీమ్‌ ఆలోచిస్తోంది. ఈ క్రమంలో డబుల్‌ బొనాంజా ప్లాన్‌ చేసిందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలైన వంశీ – ప్రమోద్‌… మెగా కుటుంబానికి బాగా దగ్గరి వ్యక్తులు.

రామ్‌చరణ్‌కు మంచి స్నేహితులు. ఈ క్రమంలో యూవీ క్రియేషన్స్‌ సినిమాలకు చరణ్‌ ఎప్పటికప్పుడు విషెస్‌ చెబుతూ ఉంటాడు. అయితే చరణ్‌తో సినిమా చేయాలని యూవీ టీమ్‌ చాలా రోజుల నుండి చూస్తోంది. ఆ మధ్య గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్నారు. అది తేలలేదు. అయితే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా ఓకే అయ్యిందని లేటెస్ట్‌ టాక్‌. ​ఇప్పుడు ఈ టాక్‌కి మించిన టాక్‌ ఇంకొకటి యూవీ కాంపౌండ్‌ నుండి వినిపిస్తోంది.

అదే చిరంజీవితో సినిమా. దర్శకుడు మారుతి ఇటీవల చిరంజీవికి ఓ కథ వినిపించి మెప్పించారట. ఆ సినిమాను యూవీ క్రియేషన్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ కలసి నిర్మిస్తాయని అంటున్నారు. అదే జరిగితే తండ్రీకొడుకులతో ఒకేసారి రెండు భారీ సినిమాలు నిర్మించే అవకాశం యూవీ టీమ్‌కి వస్తుంది. కొడుకుతో సినిమా చేస్తే చాలు అనుకున్న ప్రభాస్‌ అండ్‌ కో. కి డబుల్‌ బొనాంజానే కదా.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus