Prabhas: ‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం..!

‘అన్ స్టాపబుల్’ లో బాలయ్యతో సందడి అనంతరం.. ప్రభాస్ బయట ఎక్కడా కనిపించింది లేదు. దర్శకనిర్మాతలకు, తన టీంకి తప్ప… ప్రభాస్ ఎక్కడా కనిపించింది లేదు. మొన్నామధ్య ప్రభాస్ లుక్స్ పై ఘోరంగా ట్రోలింగ్ జరిగింది. అందువల్లే ప్రభాస్ మీడియాకి దూరంగా ఉంటున్నాడా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభాస్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ ‘రామబాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా వస్తాడేమో అని అభిమానులు ఆశపడ్డారు.

పైగా అదే బ్యానర్లో(‘పీపుల్ మీడియా’) సినిమా చేస్తున్నాడు కాబట్టి.. ‘రామబాణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కానీ ప్రభాస్ ఇప్పుడు దేశమంతా తిరగడానికి రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ మూడో వారంలో విడుదల కాబోతోంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాబట్టి దాదాపు 8 వారాల ముందు నుండి ప్రమోషన్ మొదలుపెట్టాలి.

అందుకోసమే దేశమంతా నెల రోజుల పాటు ఈ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి (Prabhas) ప్రభాస్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మే నెలలోనే మీడియాతో ఇంటరాక్షన్ ఉంది. అలాగే ఈవెంట్లు కూడా టీం ఏర్పాటు చేస్తుంది. సో, ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఈవెంట్లలో ఎలా కనిపిస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అంతేకాదు ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ మీడియాతో ముచ్చటించడం బాగా నేర్చుకున్నాడు. అంతకు ముందు అయితే సిగ్గుతో ఒకటి రెండు మాటలే మాట్లాడేవాడు. కాబట్టి ఈసారి ప్రభాస్ మాటలు కూడా హైలెట్ అవుతాయేమో..!

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus