సమ్మర్ రేసులో సీనియర్ వర్సెస్ జూనియర్స్

  • March 9, 2021 / 06:35 PM IST

తొంబైల కాలంలో చిరంజీవి వెర్సెస్ బాలకృష్ణ, నాగార్జున వెర్సెస్ వెంకటేష్, వెంకటేష్ వెర్సెస్ బాలకృష్ణ, ఇలా స్టార్ హీరోలందరూ బాక్సాఫీస్ వద్ద పోటీపడి అభిమానులను అలరించేవారు. కానీ.. ఈతరం స్టార్ హీరోలు అసలు పోటీ అనే పదానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. ఒకవేళ పొరపాటున పోటీపడాల్సి వచ్చినా… ఒకేరోజు విడుదల అవ్వకుండా ముందే జాగ్రత్తలు పడుతూ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ను మాత్రం మిస్ అవ్వడం లేదు. నిర్మాతల ప్రయోజనం కొరకు ఇది మంచి పద్దతే అయినప్పటికీ..

అసలుసిసలైన పోటీతత్వం మాత్రం కనిపించకుండాపోతుంది. అయితే.. వచ్చే ఏడాది సమ్మర్ కు మాత్రం పోటీ గట్టిగా ఉండబోతోందని తెలుస్తొంది. ఆల్రెడీ ప్రభాస్ “సలార్” సమ్మర్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా మరియు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల సినిమా వచ్చి చేరింది. ఈ రెండు సినిమాలు కూడా వారాల తేడాలో వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ కి పోటీపడేందుకు సన్నద్ధమవుతున్నాయి.

మూడు వేటికవే ప్రత్యేకమైన సినిమాలు. ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే మామూలుగా ఉండదు. అలాంటిది ప్రభాస్ హీరో అంటే అంచనాలు మామూలుగా ఉండవు, “అరవింద సమేత” అనంతరం ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్, అది కూడా పొలిటికల్ ఫిలిమ్. ఇక “గబ్బర్ సింగ్” అనంతరం పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా అంటే మామూలుగా ఉంటుందా. అందుకే ఈ మూడు సినిమాలు ఇప్పుడు సమ్మర్ బెర్త్ కోసం పోటీపడుతుండడం ఎక్కడలేని ఆసక్తిని కలిగిస్తోంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus