Prabhas: రాధే శ్యామ్ కోసం అనుకున్న ఫస్ట్ హీరో అతనే!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా అంచనాల స్థాయిని అందుకోలేకపోయింది. విడుదల రోజున అన్ని భాషలలో నెగిటివ్ కామెంట్స్ అయితే ఒక రేంజ్ లో వచ్చాయి. తెలుగులో అభిమానుల ప్రేమ వలన కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కానీ మిగతా భాషల్లో మాత్రం చాలా దారుణంగా పడిపోయాయి.

Click Here To Watch Now

ప్రభాస్ మంచి ప్రయోగంగా సినిమా సక్సెస్ అవుతుంది అనుకున్నాడు కానీ దర్శకుడు రాధాకృష్ణ అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయాడు. అయితే ఈ సినిమా కథను ఇంతకుముందు వెంకటేష్ దగ్గరకు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. రాధే శ్యామ్ ఐడియాను దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మొదట ఇతర హీరోలకు వినిపించాడు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ తో కూడా చేయాలి అనుకొని చాలాసార్లు చర్చలు జరిపారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు.

తర్వాత దర్శకుడు రాధాకృష్ణ చంద్రశేఖర్ దగ్గర పనిచేస్తూ ఐడియా గురించి తెలుసుకొని కాన్సెప్ట్ హక్కులను సొంతం చేసుకున్నాడు. కథను యూవీ క్రియేషన్స్ కు చెప్పడంతో వాళ్ళు ప్రభాస్ తో భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. ప్రభాస్ కూడా అందరి సపోర్ట్ ఉండటంతో ఆ సినిమా చేయాలి అని బాహుబలి టైమ్ లోనే అనుకున్నాడు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 300 కోట్ల వరకు ఖర్చు చేశారు.

కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఏదేమైనా ప్రభాస్ రేంజ్ తో మొత్తానికి సినిమా థియేటర్స్ లో కొనసాగుతోంది. ఇక వెంకటేష్ ట్రై చేసి ఉంటే ఎలా ఉండేదో గాని రిజెక్ట్ చేసి మంచి పని చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల శర్వానంద్ చేసి ఆడవాళ్ళు మీకు జోహార్లు మొదట వెంకటేష్ దగ్గరికి వచ్చింది. ఇక అది శర్వాతో చేయగా బాక్సాఫీస్ డిజాస్టర్ గా నిలిచింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus