Prabhas: ఆ స్టార్ డైరెక్టర్ కు ప్రభాస్ డేట్స్ కేటాయించడం సాధ్యమేనా?

  • June 13, 2024 / 07:30 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) వేగంగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. టీ సిరీస్ బ్యానర్ లో ఇప్పటికే ఆదిపురుష్ (Adipurush) సినిమాలో నటించిన ప్రభాస్ ప్రస్తుతం అదే బ్యానర్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. అయితే స్టార్ హీరో ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయాలంటే మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

సలార్ సీక్వెల్ (Salaar) , కల్కి సీక్వెల్ (Kalki 2898 AD), స్పిరిట్, హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఒక సినిమాలో ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సిద్దార్థ్ ఆనంద్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం మంచి పేరు ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన సత్తా చాటుతున్నారు.

ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. బాహుబలి సిరీస్ (Baahubali) , సాహో (Saaho) , సలార్ సినిమాలు బాలీవుడ్ లో సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. స్టార్ హీరో కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కొత్త సినిమాలకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

కల్కి సినిమాలో యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని ఇప్పటికే ట్రైలర్ ద్వారా అర్థమైంది. కల్కి సెకండ్ ట్రైలర్ కోసం కూడా ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే భారీ విజయాలను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus