యాంకర్ ప్రదీప్ మొత్తానికి మొదటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక పాజిటివ్ టాక్ వలన శనివారం కూడా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. అయితే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కు కూడా ప్రదీప్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. సినిమా విడుదలకు ముందు ప్రదీప్ స్పెషల్ గా గంగవ్వను కలిశాడు.
ఎందుకంటే మై విలేజ్ లో అనే యూ ట్యూబ్ ఛానెల్ లో ఒక రెగ్యులర్ షార్ట్ ఫిల్మ్ లో నటించిన ప్రదీప్, గంగవ్వతో కూడా నటించాడు. మొన్నటి వరకు ఆ వీడియో యూ ట్యూబ్ లో బాగా ట్రెండ్ అయ్యింది. అయితే ఆ వీడియో షూట్ చేయడం కోసం వెళ్ళినప్పుడు విజయ్ గంగవ్వ కోసం ఒక కానుక కూడా తీసుకెళ్లాడట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగవ్వ గురించి మాట్లాడిన ప్రదీప్.. మా అమ్మ గంగవ్వకు ప్రత్యేకంగా ఒక చీర సెలెక్ట్ చేసి ఇవ్వడంతో నేనే వాళ్ళ ఊరికి వెళ్లి ఇచ్చినని తెలిపాడు.
గంగవ్వ పెరుగన్నం కూడా పెట్టింది అంటూ వాళ్ళ ఊరు అక్కడి మనుషులు చాలా బావున్నారని ప్రదీప్ వివరణ ఇచ్చారు. గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ గా ఆడియేన్స్ లో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!