Prakash Raj: రూ.10 కోట్లతో ఆ పని చేస్తానన్న ప్రకాష్ రాజ్!

Advertisement

అక్టోబర్ నెల 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆదివారం రోజున 100 మంది సినీ కళాకారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి గురించి ప్రకాష్ రాజ్ చర్చించారు. ఎన్నికల్లో తన ప్యానల్ గెలిస్తే పది కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని ప్రకాష్ రాజ్ అన్నారు.

‘మా’ గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ కొంతమంది హీరోలు ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని మరికొందరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో యాక్టివ్ గా లేరని తెలిపారు. తమ ప్యానల్ విజయం సాధిస్తే కేవలం 6 నెలల్లో పనితనాన్ని చూపిస్తానని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసకబారడానికి కొంతమంది కారణమని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు మంచు విష్ణు నుంచి ప్రకాష్ రాజ్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి వెళ్లిపోయి ప్రకాష్ రాజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత పోటీ చేస్తుండగా జీవిత, బండ్ల గణేష్ లలో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus