Prakash Raj: ఇండస్ట్రీకి ఆ నటుడు మహావృక్షం లాంటి వాడు: ప్రకాష్ రాజ్

  • December 15, 2022 / 06:30 PM IST

ప్రకాష్ రాజ్… ఇండస్ట్రీలో ఈ పేరు గురించి తెలియని వారంటూ ఉండరు. భాషతో సంబంధం లేకుండా సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా కీలకపాత్రలలో నటించి ప్రముఖ ప్రతి కథానాయకుడిగా మంచి గుర్తింపు పొందాడు. గతంలో హీరోగా కూడా పలు సినిమాలలో నటించిన ప్రకాష్ రాజ్ హీరోగా కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలలో నెగిటివ్ పాజిటివ్ పాత్రలలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు.

ఇలా కొన్ని దశాబ్దాల కాలంగా ఎన్నో సినిమాలలో నటించిన ప్రకాష్ రాజ్ ఇప్పటికీ కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా..ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ బాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..” అమితాబ్ బచ్చన్ ఒక నిఘంటువు. సినిమా ఇండస్ట్రీకి ఆయన ఒక మహా వృక్షం లాంటివాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ మహావృక్షం నీడలో ఎంతోమంది ఎదుగుతున్నారు. ఆయన్ని చూసి ఎందరో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి అమితాబ్ బచ్చన్ ఒక మూల స్తంభం లాంటి వ్యక్తి అంటూ అమితాబచ్చన్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అలాగే ఈ సందర్భంగా మరొక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి కూడా ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో సల్మాన్ ఖాన్ తో కలిసి ప్రకాష్ రాజ్ రెండు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

ఆ అనుభవంతో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ తో కలిసి రెండు సినిమాలలో పని చేయడం తనకి చాలా ఆనందంగా ఉందని వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన ఎప్పుడూ దేనికీ భయపడరు. సినీ పరిశ్రమలో సల్మాన్ ఖాన్ ఎంతోమందికి సాయం చేశాడు. తన నటనతో,సేవ భావంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు అంటూ సల్మాన్ ఖాన్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus