‘మా'( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఎప్పుడు జరిగినా వివాదాలకు పెద్ద పీట వేస్తుంటారు అందులో పోటీ చేసే సభ్యులు. టర్మ్ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ ఒక్కరు భవనం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చింది లేదు.ఈసారి ప్రకాశ్ రాజ్ వంటి అగ్ర నటుడు పోటీ చేస్తుండడంతో ఈసారి ఎన్నికల హడావిడి మరింత హీట్ ఎక్కింది.అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
ఇప్పటివరకు ఆయనకు పోటీగా నిలబడ్డ.. సీనియర్ నటి జయసుధ, నటి జీవిత, నటి హేమ వారు ఆయన ప్యానెల్ కే జంప్ అయినట్టు ప్రకాశ్ రాజ్ ధ్రువీకరించడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ‘సీనియర్ నటి జయసుధ గారిని మెయిన్ ప్యానెల్ లోకి తీసుకోవాలనుకున్నప్పటికీ.. ఆవిడ స్పోక్స్ పర్సన్ గా ఉంటానని చెప్పడంతో ఆమెను అందులో భాగం చేశారట.ప్రకాష్ రాజ్, జయసుధ లతో పాటు జీవిత, సాయి కుమార్, బండ్ల గణేశ్, బెనర్జీ, స్పోక్స్ పర్సన్స్ గా ఉంటారని ప్రకాశ్ రాజ్ వెల్లండించారు.
సెప్టెంబర్ 3 వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అప్పుడు మరో ప్రెస్ మీట్ పెడతానని కూడా ఆయన చెప్పుకొచ్చారు.’మా’ భవనం ఇష్యు ఒక్కటే కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని.. వాటి పై కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత కూడా తమ పై ఉందని ప్రకాష్ రాజ్ తెలిపారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!