Pranitha Subhash: ప్రణీతకు ఆ ఆనందం దక్కలేదా?

  • July 25, 2021 / 10:12 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసినా హీరోయిన్ ప్రణీత స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత మే నెలలో పెళ్లి చేసుకుని అభిమానులకు భారీ షాకిచ్చారు. ప్రస్తుతం ప్రణీత బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టగా ఆమె నటించిన హంగామా 2 సినిమా తాజాగా విడుదలైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో పాటు ప్రణీత పర్ఫామెన్స్ కు సైతం నెగిటివ్ మార్కులు పడ్డాయి.

సినిమాలో కంటెంట్ చెత్తగా ఉందని క్రిటిక్స్ ఈ సినిమాకు దారుణంగా రేటింగ్స్ ఇచ్చారు. ఈ సినిమా ప్రణీత కెరీర్ కు మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీనియర్ నటి శిల్పాశెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటించడం గమనార్హం. కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు ప్రణీత బాలీవుడ్ ఇండస్ట్రీకి సూట్ కాదని పేర్కొన్నాయి. పెళ్లి తర్వాత రిలీజైన తొలి సినిమా కూడా ప్రణీత జాతకాన్ని మార్చలేకపోయింది. అందం, అభినయం ఉన్నా ప్రణీత నటిగా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ప్రణీత భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. హంగామా2 సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ప్రణీత ఫ్యాన్స్ సైతం నిరాశకు గురవుతున్నారు. ప్రణీత కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పెళ్లి తర్వాత కూడా ప్రణీత నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus