జాంబీరెడ్డి తరువాత.. తెలుగోళ్ళు చూడని మరో రెండు చూపిస్తాడట

సినిమా ఎంత డిఫరెంట్ గా తీసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో కొంత హిట్టయితేనే దర్శకులకు మంచి అవకాశాలు వస్తుంటాయి. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన విధానం కొత్తగా ఉన్నప్పటికీ మనోడు అనుకున్నంత రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రాఫిట్స్ ఏమి అంధించడం లేదు. అ! సినిమాతోనే ఓ వర్గం వారు బాగానే మెచ్చుకున్నప్పటికి ఏ అగ్ర దర్శకుడు కూడా ఆ సినిమాపై సింగిల్ ట్వీట్ వేయలేదు ఎందుకో..

ఇక ప్రశాంత్ వర్మ కల్కి డిఫరెంట్ మూవీ అంటూ ఓ వర్గం నుంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి గాని ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు జాంబీ రెడ్డి సినిమాను రెడీ చేసిన ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో ఇంతవరకు ఎవరు చూడని సినిమా అంటూ ప్రమోషన్ బాగానే చేస్తున్నాడు. ఇక ఆ సినిమా హిట్టయితే గనక ప్రశాంత్ తన ఆలోచనల డోస్ ఇంకాస్త పెంచుతాడట.

ఇంతవరకు తెలుగోళ్ళు చూడని మరో రెండు డిఫరెంట్ జానర్స్ ను చూపిస్తానని అంటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ అంటూ హడావుడి బాగానే చేస్తున్నప్పటికీ ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకోలేకపోతున్న ప్రశాంత్ జాంబీ రెడ్డితో అయినా అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బజ్ అయితే బాగానే ఉంది. చాలా వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. మరి సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus