Prashanth Neel: ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సలార్1 ట్రైలర్ గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. సలార్ సినిమా ఉగ్రమ్ సినిమాకు రీమేక్ అని జరుగుతున్న ప్రచారం గురించి సైతం ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. కేజీఎఫ్, సలార్ సినిమాలు రెండు విభిన్నమైన ప్రపంచాలు అని ప్రశాంత్ నీల్ అన్నారు.

ఆ రెండు ప్రపంచాలను కలపాలని నేను కోరుకోనని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. నాకు అంత సామర్థ్యం కూడా లేదని ప్రశాంత్ నీల్ అన్నారు. ప్రభాస్ సినిమా కథను సులువుగా ఒప్పుకోరని ప్రశాంత్ నీల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక బ్లాక్ బస్టర్ మూవీకి కాపీ చేయాల్సిన అవసరం ప్రభాస్ కు లేదని ఆయన తెలిపారు. ప్రభాస్ స్థాయి కూడా అది కాదని ప్రశాంత్ నీల్ అన్నారు.

ప్రశాంత్ నీల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తన కామెంట్స్ తో ప్రశాంత్ నీల్ సలార్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు. అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్లు భారీ రేంజ్ లో ఉండగా సలార్1 సక్సెస్ సాధిస్తే సలార్2 సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ బ్లాక్ బస్టర్ హిట్ తో, దిమ్మతిరిగే కలెక్షన్లతో 2023 సంవత్సరానికి గుడ్ బై చెబుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ కావడంతో కన్నడ, హిందీ భాషల్లో సైతం సలార్ మూవీకి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో బుకింగ్స్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది. 2023 బిగ్గెస్ట్ హిట్ గా సలార్ నిలుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus