Prashanth Neel, Prabhas: ప్రశాంత్‌ నీల్‌ ప్రమోషనల్‌ స్ట్రాటజీ షురూ!

Advertisement

ఒక అగ్ర హీరో సినిమా కోసం ఇంకో అగ్ర హీరో ప్రచారం చేయడం అంటే చాలా అరుదు. ఒక రెండు, మూడేళ్ల క్రితం వరకు ఇలాంటి సంస్కృతి మన దగ్గర పెద్దగా ఉండేది కాదు. ఎప్పుడో కానీ అలా జరగలేదు. అయితే పాన్‌ ఇండియా సినిమాల పుణ్యమా అని ఇలాంటివి చూడగలుగుతున్నాం. ఈ క్రమంలో మరో అరుదైన స్టార్‌ హీరోల కలయిక చూడబోతున్నాం అని తెలుస్తోంది. ఈసారి శాండిల్ వుడ్‌ – టాలీవుడ్‌ కాంబో చూడొచ్చు.

Click Here To Watch NOW

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారం కోసం వివిధ రాష్ట్రాల్లో ఈవెంట్లు పెడితే ఆ ‘వుడ్‌’కి చెందిన అగ్రహీరోలు, యువ హీరోలు వచ్చి కార్యక్రమంలో సందడి చేశారు. అలా వచ్చినవాళ్లలో సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్, శివకార్తికేయన్‌.. లాంటివాళ్లు ఉన్నారు. ఈ సినిమా తర్వాత శాండిల్‌ వుడ్‌ నుండి మరో పాన్‌ ఇండియా సినిమా వస్తోంది. అదే ‘కేజీయఫ్‌ 2’. కన్నడ సినిమాగా రూపొంది పాన్‌ ఇండియా సినిమా మారి.. భారీ విజయం దక్కించుకున్న చిత్రం ‘కేజీయఫ్‌’. దాని సీక్వెలే ఇది.

ఏప్రిల్‌ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాల్సి ఉన్నా… ‘ఆర్ఆర్‌ఆర్‌’ మేనియాలో ఎందుకు అనుకున్నారేమో లేట్‌ చేశారు. త్వరలో ‘కేజీయఫ్‌ 2’ ప్రచారం షురూ చేస్తారు. దీని కోసం తెలుగు చలన చిత్ర సీమ నుండి ప్రభాస్‌ కీలకంగా వ్యవహరిస్తారని సమాచారం. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘సలార్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అనే విషయం తెలిసిందే. ఈ పరిచయంతోనే ప్రభాస్‌ … ‘కేజీయఫ్‌ 2’ ప్రచారానికి వస్తున్నాడని అంటున్నారు.

తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ ‘కేజీయఫ్‌ 2’ ప్రచారం కోసం అగ్ర హీరోలను దింపే పనిలో ఉన్నారని సమాచారం. ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసిందట. ‘ఆర్‌ఆర్ఆర్‌’ విడుదలై… కాస్త ఆ ప్రచార వేడి తగ్గాక రెండో ‘కేజీయఫ్‌’ ప్రచారం జోరు పెంచుతారట. ఈలోపు ఎవరెవరు ప్రచారానికి వస్తారో తెలిసే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus