‘తమ్ముడు’, ‘నరసింహనాయుడు’ లాంటి హిట్టు సినిమాల్లో నటించిన హీరోయిన్ ప్రీతి జింగానియా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. హిందీలో ఆమె నటించిన ‘మొహబ్బతేన్’ సినిమా నటిగా ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. నటుడు పర్విన్ దాబాస్ తో పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ ప్రస్తుతం నిర్మాతగా మారి ఓటీటీకి చిత్రాల్ని నిర్మిస్తోంది. తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..
తన సినీ పరిశ్రమ అనుభవాలను, పలు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది. ప్రేక్షకులు ఇప్పటికీ కూడా తనను ‘చుయిముయి అమ్మాయి’ లేదా ‘మొహబ్బతేన్ అమ్మాయి’అని పిలుస్తారని.. ఈ రెండు ట్యాగ్ లతో చిక్కుకున్నందుకు ఓ వైపు బాగానే ఉన్నప్పటికీ మరోపక్క ప్రేక్షకులు కేవలం తనను మోడర్న్ పాత్రలో కంటే చీరోనే చూడడానికి ఇష్టపడుతుండడం కాస్త ఇబ్బంది కలిగిస్తుందని చెప్పింది. అంతేకాకుండా.. తాను ముద్దు సీన్లలో నటించడం కూడా ప్రేక్షకులకు నచ్చేది కాదని చెప్పుకొచ్చింది.
అయితే తనకు మాత్రం కెరీర్ లో ఇతర పాత్రలను కూడా చేయాలని ఉందని.. ఎందుకంటే తానొక నిస్సహాయ కోడలిగా ఉండడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ఇలా ఒక జోనర్ కే పరిమితమై నటించడం ఎవరికీ నచ్చదని తెలిపింది. ప్రస్తుతం ప్రీతి జింగానియా తన భర్తతో కలిసి ముంబైలో నివాసముంటున్నారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!