ప్రియా తెలివితేటలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

  • February 24, 2018 / 11:20 AM IST

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియాతో పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె పేరు తెలియని సినీ ప్రేక్షకుడు లేడు. ‘ఒరు అదర్ లవ్’ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ సాంగ్ తో విపరీతమైన ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇన్‌స్టా గ్రాంలో ఆమెను 4 .5 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. ఇలా అభిమానులు ఏర్పడతారని ఆమె ఊహించలేకపోయినా.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి మంచి ప్లాన్ వేసింది. నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేష్ 2 కోట్లు అడుగుతున్న ఈ భామ.. ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ లకు సైతం రేట్ ఫిక్స్ చేసింది. తన అకౌంట్ లో ఒక వాణిజ్య పోస్ట్ కి 8లక్షలు అడుగుతోందని సమాచారం.

ఇప్పటి వరకూ బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు మాత్రమే ఇంత పెద్ద మొత్తం వసూలు చేసేవారు. వాళ్ళ సరసన ప్రియా వారియర్ చేరిపోయింది. చిన్నప్పుడు చదువుకున్న దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను బాగా గుర్తుపెట్టుకున్నట్టుంది. అందుకే ఇలా ప్లాన్ చేసింది. ఇక తెలుగులోనూ ఈ భామని పరిచయం చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. “ఒరు అదర్ లవ్” మాత్రం వచ్చే నెల రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus